ఈ విషయం లో కుక్కల్ని నమ్ముకుంటే బెటర్ 

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశంలో  మహమ్మారి రెండవ వేవ్ భీభత్సం  సృష్టిస్తున్నది అయితే అదే ఊపులో వ్యాక్సినేషన్ కూడా అడుగులు ముందుకు వస్తోంది దీంతో దేశవ్యాప్తంగా వాక్సినేషన్ పొందిన వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది ఇది మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక అద్భుతమైన అస్త్రంగా పరిగణించబడుతోంది దీనికితోడు మహమ్మారి బారిన పడ్డ వాళ్ళు ఇంకా మహమ్మారి సోకని వాళ్లకు అందించకుండా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. పదిమంది తిరుగుతున్నా ప్రదేశాల్లో సూపర్ స్పైడర్ లేకుండా కూడా చూసుకోవాలి మరి అది ఎలా గుర్తించాలి కనపడ్డ వారి నల్ల టెస్ట్ చేయడం ఇంపాజిబుల్ అయితే దీనికి ఒక చిన్న ఉపాయం ఉంది ..అదే కుక్క. కుక్కలు మహమ్మారి బారిన పడ్డ మనుషులను గుర్తిస్తాయట వారికి symptoms ఉన్నా లేకపోయినా.. అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా మహమ్మారి తో బాధ పడుతున్నారు అంటే వారిని ఆ కుక్క పసిగడుతుంది ..వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిజంగా ఉపయోగపడుతున్న మంత్రమైనా?  మనం చూద్దాం

 నిజానికి కుక్కలు విశ్వాసపాత్రులు అని మనకు తెలుసు .మనిషితో స్నేహం గా ఉండే జంతువుల్లో ప్రస్తుతం కుక్క మొదటి స్థానాన్ని తీసుకుంటుంది అయితే ఇది కేవలం మనిషికి స్నేహం మాత్రమే కాదు రక్షణ కూడా పంచుతుంది. ఎలా అంటే  కుక్కలు దొంగల్ని పసిగడుతుంది బాంబులను పసిగడుతుంది రకరకాల ఆయుధాలను గన్ పౌడర్ ని పసిగడుతుంది అదే క్రమంలో ఇప్పుడు మహమ్మారి బారిన పడ్డ వారిని కూడా పసిగడుతుంది. సరైన ట్రైనింగ్ ఇస్తే ప్రతి కుక్క కొన్ని జబ్బులు గుర్తుపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు .యునైటెడ్ కింగ్డమ్లో శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే ఊహన్ వైరస్ను  90 శాతం వరకు కుక్కలు పసిగడుతున్నాయట

 మరి అవి ఎలా పసిగడతాయి అంటే మహమ్మారి బారిన పడ్డవారు ఒక రకమైన వాసన ను వెదజల్లుతారు అట ఈ వాసన ను మనుషులు గుర్తుపట్టలేరు కానీ కుక్కలు ఖచ్చితంగా గుర్తు పడతారట ప్రతి కుక్క లో 35 కోట్ల రిసెప్టార్స్ ఉంటాయట అవి రకరకాల వాసనను గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి అట ఆ కుక్కకి అందులో ఒక వాసన మహమ్మారి వాసన. ఇక్కడి శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పరిమెంట్ చేపట్టారు మహమ్మారి బారిన పడ్డ రోగుల యొక్క బట్టలు వారి మాస్కులు సేకరించారు పెద్దమొత్తంలో వాటిని సేకరించిన తర్వాత కుక్కలకు వాటి వాసన చూసే ట్రైనింగ్ ఇచ్చారు అంతే అవి మహమ్మారి వాసనను గుర్తు పెట్టేస్తున్నాయి నిజానికి ఆర్ టి పి సి ఆర్ టెస్టులను పక్కకు నెట్టి ఈ కుక్కల టెస్టులు చేయడం అసాధ్యం కాకపోతే కన్ఫర్మేషన్ కోసం ఈ కుక్కలు ఉపయోగించుకోవడం మాత్రం సాధ్యపడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. 91 శాతం సక్సెస్ ఆ కుక్కలు ఆ అధ్యయనంలో అందించాయి .. నిజానికి ఎయిర్పోర్టు లలో ఈ కుక్కలు గేమ్ changerగా నిలుస్తాయి. ఈ అధ్యయనాన్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ప్రపంచానికి ఈ విషయాన్ని మరొకసారి చెబుతాను అంటున్నారు శాస్త్రవేత్తలు అదే గనక పూర్తి నిజమైతే మాత్రం ఫ్రంట్లైన్ వారియర్స్ లో కుక్కలు ఉండటం మనుషుల యొక్క అదృష్టం అంటున్నారు .వారు టెస్ట్ కు వచ్చిన వారు శాంపిల్స్ ని వరుసగా పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత కుక్కను వదులుతారు ఆ కుక్క అన్ని శాంపిల్ సువాసన చూసుకుంటూ వెళుతుంది ఎక్కడైతే మహమ్మారి ఉంది ఆ శాంపిల్ లో అని తెలుస్తుందో అక్కడ ఆ కుక్క ఆగిపోతుంది దాన్ని వీళ్ళు note చేసుకుంటారు రెండో కుక్కని ప్రవేశపెడతారు ఆ శాంపిల్  దగ్గర ఆ కుక్క కూడా ఆగింది అంటే అది కన్ఫామ్ చేసుకోవడానికి మూడో కుక్కను  కూడా వదులుతారు మూడు కుక్కలు ఒక శాంపిల్  దగ్గర అనుమానాస్పదంగా ఆగినట్లు అయితే మాత్రం అది ఖచ్చితంగా కోవిద్  బాధితుడు యొక్క శాంపుల్ అని అర్థం చేసుకుంటారు శాస్త్రవేత్తలు .దాన్ని ఇంటర్నేషనల్ డేటాతో పాటు సైంటిఫిక్ డాటా కింద కూడా మలిచి దాన్ని రికార్డు చేస్తారు. ఇప్పటి వరకు పరీక్ష అంటే ముక్కులో స్వబు  పెట్టి గెలకడం ,కానీ ఇప్పుడు పరీక్ష అంటే కుక్కని పిలవటం, బెడ్ మీద ఉండి లేవలేని స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ కుక్కలు అపారమైన సేవ చేస్తాయి ,మరి ఇంత వాసన పిలుస్తున్న కుక్కలకు కరోనా  రాదా  అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు .చూద్దాం మరి రాబోయే రోజుల్లో కుక్కలు ఏరకంగా టెస్టింగ్ లో గేమ్ చెంజర్ గ  మారుతాయో.

Comments

Post a Comment

Popular posts from this blog