heroin అనుపమ నిఖిల్ మొహం మీద ఏం రాసింది

18 pages నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో తెరపైకి వస్తున్న చిత్రం 18  పేజెస్. కుమారి 21ఎఫ్ ఫేమ్  డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా 18 పేజెస్ అల్లు అరవింద్ సమర్పణలో ga2 పిక్చర్స్  సుకుమార్ రైటింగ్ బ్యానర్లపై సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు .అయితే జూన్ 1న నికిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. నిజానికి ఇందులో ఎట్రాక్టివ్ పాయింట్లు రెండు ఉన్నాయి ఒకటి ఈ సినిమా పోస్టర్ రిలీజ్ ఏదైతే ఉందో అది నికిల్ పుట్టినరోజు సందర్భంగా ఒక డాబామీద రిబ్బన్ కట్ చేసి ఆ పోస్టర్ను hang  చేశారు. నిజానికి నేటి సినిమా చరిత్రలో  ఇది ఒక కొత్త ప్రయోగం, మహమ్మారి నేపథ్యంలో ఇలాంటి క్రియేటివిటీని ఎంచుకోవడం సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది ఇక రెండో విషయం నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి అందులో హీరోయిన్ ఏదో పెన్నుతో రాస్తున్నట్లు గా ఉంటుంది పోస్టర్, ఈ పోస్టర్ చాలా మందిని ఎట్రాక్ట్ చేసింది ,అయితే ఈ ఫోటోను హీరోయిన్ అనుపమ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది తను చెప్తుంది ,నా పేరు నందిని నాకు మొబైల్ లో అక్షరాలను టైప్ చేయడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి కానీ ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది దానిపై మీ సంతకం ఉంటుంది నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది... అని ట్వీట్ చేసింది .మరోవైపు ఆ అతికించిన పేపర్ పై ఇలా రాసి ఉంది. నా పేరు నందిని నాకు జీవితం అంటే చాలా ఇష్టం. నాకు నేనంటే ఇంకా ఇష్టం అందుకే ఎక్కువగా నాలో నేనే మాట్లాడుకుంటూ ఉంటాను. నాకు బోర్ కొట్టడం తెలియదు నాకు తెలిసి ఈ లోకంలో గొప్ప కళ ఏదైనా.... అంటూ సాగుతుంది.. 

https://www.youtube.com/watch?v=OH2TnDz2YjE

Comments

Popular posts from this blog